వరంగల్ బీసీ గురుకుల హాస్టల్‌లో శానిటైజర్ తాగిన విద్యార్థినిలు...!

* మనస్తాపంతో శానిటైజర్ తాగిన ఐదుగురు బాలికలు.. ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన సిబ్బంది

R Tripura Malini
Published on: 20 Nov 2022 1:39 PM IST
వరంగల్ బీసీ గురుకుల హాస్టల్‌లో శానిటైజర్ తాగిన విద్యార్థినిలు...!
X

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరెపల్లె బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలకు సంబంధించి తలెత్తిన గొడవ, ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తుంది. బర్త్ డే వేడుకలకు హాస్టల్లోని విద్యార్ధులే కాకుండా ఇతర విద్యార్థినులు హాజరుకావడంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థినులను మందలించినట్లు సమాచారం. దీంతో హాస్టల్ విద్యార్థినులకు, బయటి విద్యార్ధులకు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మనస్థాపంతో శానిటైజర్ తాగిన విద్యార్ధినిలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story