Top
logo

Road Accident: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

Five People Dead in Sangareddy Road Accident
X

Road Accident: సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

Highlights

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటకూర్‌ దగ్గర కారును ఢీ కొట్టింది లారీ. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి నుండి మెదక్‌ వెళ్తుండా ప్రమాదం జరిగింది.

మెదక్‌ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Web TitleFive People Dead in Sangareddy Road Accident
Next Story