వచ్చేస్తున్నాయ్‌.. కల్యాణ ఘడియలు.. డిసెంబరులో అయిదు శుభ ముహూర్తాలు

five auspicious moments in december
x

 డిసెంబరులో అయిదు శుభ ముహూర్తాలు

Highlights

* పెళ్లి కళను సంతరించుకోనున్న భాగ్యనగరం.. ఏకం కానున్న 25 వేలకుపైగా జంటలు

Hyderabad: భాగ్యనగరానికి పెళ్లి కళ రానుంది. మరికొద్ది రోజుల్లో నగరమంతటా బాజాభజంత్రీలు మోగనున్నాయి. మూఢాల కారణంగా 3నెలలుగా శుభ కార్యాలు నిలిచిపోయాయి. ఈ నెలాఖరుతో అవి తొలగిపోనున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారం నుంచి పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్‌ హాళ్లు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు బుక్‌ అయ్యాయి. మరోవైపు కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న మార్కెట్లు సైతం క్రమంగా కళకళలాడుతున్నాయి. డిసెంబరు నెలలో కేవలం 5 ముహూర్తాలే ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో ఫంక్షన్‌ హాల్‌లో రోజుకు కనీసం రెండు పెళ్లిళ్ల చొప్పున బుక్‌ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. డిసెంబరు తర్వాత తిరిగి ఫిబ్రవరి వరకు ముహూర్తాలు లేకపోవడంతోనూ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories