Harish Rao: స్వరాష్ట్రంలో గంగపుత్రుల పంట పండిందన్న మంత్రి హరీష్ రావు

Harish Rao: తెలంగాణ నుంచి చేపలు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి గంగపుత్రులు ఎదిగారని వ్యాఖ్య

Rama Rao
Published on: 21 Sept 2022 4:04 PM IST
Fishes Released in Komati Pond of Siddipet Town | TS News
X

Harish Rao: స్వరాష్ట్రంలో గంగపుత్రుల పంట పండిందన్న మంత్రి హరీష్ రావు

Harish Rao: స్వరాష్ట్రం ఏర్పడ్డాక గంగపుత్రుల పంట పండిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక్కప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణకు చేపలు తెచ్చుకునే వాళ్ళమని... ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి చేపలు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి గంగపుత్రులు ఎదిగారాని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా సిద్ధిపేట పట్టణం కోమటి చెరువులో లక్షా 20 వేల చేప పిల్లలను విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నీళ్లతో రాష్ట్రంలో చెరువులు కళకళ లాడుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల చేప పిల్లలను పంపిణీ చెయ్యడం జరిగిందన్నారు. సిద్దిపేట నియెజకవర్గ వ్యాప్తంగా అన్ని చేరువుల్లో చేపలు విడుదల చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

Rama Rao

Rama Rao

Next Story