కేసీఆర్ సీఎం అయ్యాక కాంగ్రెస్ నేతలకు ఫస్ట్‌ టైమ్ అపాయింట్‌మెంట్‌.. రాజకీయ వర్గాల్లో..

KCR Appointment: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 26 Jun 2021 6:42 AM IST
First Time Appointment for Congress Leaders After Becoming KCR CM
X

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

KCR Appointment: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దాంతో, టీకాంగ్రెస్‌ నేతలు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌‌తో సమావేశమయ్యారు. మరియమ్మ లాకప్‌ డెత్‌‌ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అలాగే, ఏపీతో నెలకొన్న జల జగడంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీకాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.

అయితే, టీకాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక టీకాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లీడర్లు గతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ అవకాశమివ్వలేదు. పైగా అసెంబ్లీలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా సీఎల్పీ బృందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story