Karimnagar: కరీంనగర్‌ లక్ష్మీనగర్‌లో కాల్పుల కలకలం

Karimnagar: ఆస్తుల విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య గొడవ * తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు

Sandeep Eggoju
Published on: 17 July 2021 10:00 AM IST
Firing Issue in Karimnagar Laxminagar
X

కరీంనగర్ లక్ష్మినగర్లో  కాల్పుల కలకలం

Karimnagar: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఆస్తుల విషయంలో అన్నాదమ్ముళ్లు గొడవ పడ్డారు. ఘర్షణలో భాగంగా తమ్ముడు సయ్యద్‌ మున్వర్‌ హుస్సేన్‌పై.. అన్న ఆస్గర్‌ హుస్సేన్‌ కాల్పులకు తెగబడ్డాడు. అంతేకాదు కత్తితో చంపేందుకు యత్నించాడు. అయితే బుల్లెట్లు సమీంపలోని కారులోపలికి దూసుకెళ్లడంతో కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న అన్నాదమ్ముళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story