Sangareddy: టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో పేలిన బాణాసంచా.. ఒకరి పరిస్థితి విషమం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో మెడికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 1:40 PM IST
Fire Incident In TRS Bike Rally At Sangareddy
X

Sangareddy: టీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో పేలిన బాణాసంచా.. ఒకరి పరిస్థితి విషమం

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో మెడికల్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో టపాసులు కాల్చారు. దీంతో టపాసులు ఉన్న ఆటోలో నిప్పు రవ్వలు పడతంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. 90 శాతం కాలిన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ర్యాలీలో ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్‌కు స్వల్పగాయలయ్యాయి. ఇక తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్ధ్‌గా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story