Express Train: దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ లగేజీ బోగీలో చెలరేగిన మంటలు

Express Train: భువనగిరి సమీపంలోని పగిడిపల్లి వద్ద ఘటన

Jyothi
Published on: 3 July 2022 9:27 AM IST
Fire Broke out in the Luggage Bogie of Dakshin Superfast Express
X

Express Train: దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ లగేజీ బోగీలో చెలరేగిన మంటలు

Express Train: యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో పార్శిల్‌ బోగీలో ఉన్న సరుకు అంతా దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు. కాగా, పార్శిల్‌ బోగీలు మంటలు అంటుకోవడంతో మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story