Fire Accident: మాదాపూర్‎లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంటలు.. పరుగులు పెట్టిన ఉద్యోగులు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Dec 2024 8:04 AM IST
Fire Accident: మాదాపూర్‎లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంటలు.. పరుగులు పెట్టిన ఉద్యోగులు
X

Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలుముకోవడంతో..ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story