హైదరాబాద్‌ చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident At Chikkadpally in Hyderabad
x

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Highlights

Hyderabad: పాత డెకరేషన్ గోడౌన్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Hyderabad: హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద VST సమీపంలో ఉన్న పాత డెకరేషన్ గోదాములో మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎడిగిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. తీవ్ర స్థాయిలో మంటలు ఎడిసిపడుతుండటంతో గోదాము కూలిపోతుంది. పక్కనున్న సుగ్న మెటల్స్, ఆపిల్ లెడ్ బల్బ్స్ గోదాములకు మంటలు విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజినట్లో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు DRF, ఫైర్ సిబ్బంది.

Show Full Article
Print Article
Next Story
More Stories