ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

Arun Chilukuri
Published on: 12 Dec 2020 2:38 PM IST
ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం
X

సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారంలోని వింధ్యా ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దంతో రియాక్టర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. దాంతో వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లతో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ ఇంజన్‌ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

భారీ పేలుళ్లతో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. మరో వైపు ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో కార్మికులు ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే గానీ, వారు ఎంత మంది అనేది తెలియడం లేదు.. లోపల ఉన్నవారి గురించి ఆరా తీస్తున్నారు. మంటలకు కెమికల్స్ తోడు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story