ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో తుది వాదనలు
* ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ పారదర్శకంగా విచారణ జరపలేదంటూ వాదనలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో తుది వాదనలు
MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. అభ్యంతరాలు ఉంటే ఇవాళ తుది వాదన వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు దశలో ఉండగా ఫామ్‌హౌస్‌లోని వీడియోలు, ఆడియోలు సీఎం కేసీఆర్‌కు చేరడంపై పిటీషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మీడియాకు రిలీజ్ చేసిన ఫుటేజ్‌ను కోర్టుకు అందించారు. దీంతో పిటీషనర్లు అందించిన ఫుటేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత తుది తీర్పు వెల్లడించనుంది.
Next Story




