గాంధీభవన్‌లో హైటెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో ఓయూ నేతల ఘర్షణ

Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ వేదికగా బహిర్గతమయ్యాయి.

Arun Chilukuri
Published on: 22 Dec 2022 4:39 PM IST
Fighting Between Former MLA Anil and NSUI Activists at Gandhi Bhavan
X

గాంధీభవన్‌లో హైటెన్షన్‌.. మాజీ ఎమ్మెల్యే అనిల్‌తో ఓయూ నేతల ఘర్షణ

Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ వేదికగా బహిర్గతమయ్యాయి. హస్తం నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. గాంధీభవన్ లో ఒకరినొకరు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. బండ బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో NSUI విద్యార్థి నేతలు వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో అనిల్ కుమార్ పై NSUI విద్యార్థి నేతలు దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్ .. సేవ్ కాంగ్రెస్, దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం, అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, గాంధీభవన్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ ఆపాలని NSUI కార్యకర్తలను మల్లు రవి బతిమాలాడారు. దండం పెడతా గొడవ ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. మల్లు రవి అడ్డుపడటంతో వివాదం సద్దుమణిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story