Free Bus: ఫుట్ బోర్డ్ ప్రయాణం.. పీఎస్‌కు చేరిన ఆర్టీసీ లొల్లి..

Free Bus: పోలీస్ స్టేషన్‌కి వింత వింత కేసులు వస్తుండటం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. తండ్రి కొట్టాడనో టీచర్ మందలించిందనో చిన్న పిల్లలు వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Jun 2024 4:32 PM IST
Fight Between Female Passenger And The Conductor In An RTC Bus Went To The Police Station
X

Free Bus: ఫుట్ బోర్డ్ ప్రయాణం.. పీఎస్‌కు చేరిన ఆర్టీసీ లొల్లి..

Free Bus: పోలీస్ స్టేషన్‌కి వింత వింత కేసులు వస్తుండటం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. తండ్రి కొట్టాడనో టీచర్ మందలించిందనో చిన్న పిల్లలు వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి. కానీ ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తోందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్లే బస్సు రద్దీగా ఉండటంతో ఓ మహిళ బస్ మెట్లపై నిలబడింది. కండక్టర్ ఎంత వారించినా మహిళ వినకుండా అక్కడే నిలపడింది.

దీంతో బస్సును నేరుగా పీఎస్‌కు తీసుకెళ్లాలని కండక్టర్ చెప్పడంతో డ్రైవర్ చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. చివరికి ఫుట్ బోర్డు ప్రయాణం చేయవద్దంటూ పోలీసులతో సదరు మహిళకు కండక్టర్ చెప్పించాల్సి వచ్చింది. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తూ కింద పడితే 6 నెలల పాటు తనను పక్కన పెట్టేస్తారని అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది కండక్టర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story