MLC Kavitha: ఐదో రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

MLC Kavitha: రేపు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి రానున్న కవిత రిట్ పిటిషన్

Shashank Gullapelli
Updated on: 21 March 2024 10:19 AM IST
Fifth Day Of MLC Kavitha ED Investigation
X

MLC Kavitha: ఐదో రోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ 

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు ఈడీ ఆధికారులు విచారించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ రానున్నది. లిక్కర్ కేసులో కీలక విషయాలను రాబట్టడంలో భాగంగా ఆగస్ట్ 22న ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. నాలుగో రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్ లను విచారించారు. కవిత అరెస్ట్ సమయంలో పీఏల పోన్లను సీజ్ చేయించిన అధికారులు ఫోన్ లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నించింది. కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు రాత్రి ఏడు గంటలకు కలిశారు. ఇవాళ ములాఖత్ సమయంలో కవిత తల్లి శోభ వచ్చే అవకాశం ఉంది. ఈడీ నిబంధనలు ఉల్లంఘించందంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందని తన పిటిషన్ లో తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story