వరుస కాల్పులతో ఖమ్మం అడవి దద్దరిల్లుతోంది

వరుస కాల్పులతో ఖమ్మం అడవి దద్దరిల్లుతోంది
x
Highlights

ఒకవైపు పోలీసులు.. మరోవైపు మావోయిస్టులు ఖమ్మం ఏజెన్సీలో నిత్యం తూపాకుల చప్పుడుతో ఏజెన్సీ బిక్కుబిక్కుమంటోంది. దాంతో అడవి బిడ్డలు నిత్యం...

ఒకవైపు పోలీసులు.. మరోవైపు మావోయిస్టులు ఖమ్మం ఏజెన్సీలో నిత్యం తూపాకుల చప్పుడుతో ఏజెన్సీ బిక్కుబిక్కుమంటోంది. దాంతో అడవి బిడ్డలు నిత్యం భయం గుప్పిట్లో బతుకు జీవనం గడుపుతోంది. ఇప్పటి వరకు ఛత్తీస్ గడ్ కేంద్రంగా కార్యకలాపాలు జరిపిన మావోయిస్టులు గోదావరి దాటి తెలంగాణాలోని ప్రవేశించడంతో పోలీసులకు సవాల్ గా మారుతోంది. ఓవైపు ఉనికి కోసం మావోయిస్టులు వారిని అణిచివేసేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో పచ్చని అడవిలో నిత్యం కాల్పుల చప్పుడుతో టెన్షన్ వాతావరం కనిపిస్తోంది. కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో నెలకొన్నఉద్రిక్తతల పై స్పెషల్ స్టోరీ.

నెలరోజుల క్రితం మావోయిస్టుల యాక్షన్ టీం తెలంగాణా జిల్లాల్లోకి ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇన్నాళ్లు తెలంగాణాలో ఉనికి లేని మావోయిస్టులు తమ సత్తా చాటేందుకు ఏకంగా యాక్షన్ టీంని రంగంలోకి దింపడం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తుండటంతో ప్రభుత్వం సీరియస్ గా ముందుకు కదులుతోంది. జులై రెండో వారంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోలు త్రుటిలో తప్పించుకున్నారు. ఎదురు దాడిలో గ్రౌహాండ్స్ పోలీసులు గాయాలు కావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే తెలంగాణా పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి మణుగురు అటవీ ప్రాంతంలో పర్యటించి పోలీసు అధికారులకు దిశా నిర్థేశనం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక అప్పటి నుండి తప్పించుకుపోయిన మావోల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు కొత్తగూడెం, ఇల్లందు ఏరియాల్లో సంచరించినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలోని ప్రతీ మూల ప్రత్యేక పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల కోసం గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, ఏటురునాగారం, మహబుబాబాద్‌ జిల్లాలలోని గంగారం, పాకాల అడవుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గుండాల అటవీ ప్రాంతంలో మావోల కదలికలను పసిగట్టిన సుమారు 500మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేసారు. ఇటీవల గుండాల మండలం దేవలగూడెం అటవీ ప్రాంతంలో బైక్ పై వెళుతున్న మావోయిస్టులను లొంగిపొమని హెచ్చరించినా కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఛత్తీస్ ఘడ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు చనిపోయాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు.

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు ఎన్‌కౌంటర్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. తుపాకీ చప్పులతో గిరిజనులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ వైపు డీజీపీ మహేందర్ రెడ్డి మన్యం ఏరియాల్లో పర్యటిస్తుండగా ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. గత జూలైలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు జరుపుతున్న వేటలో భాగంగానే ఈ కాల్పులు ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. దాంతో అడవులను జల్లెడపడుతూ కూంబింగ్ చేపట్టారు. మొత్తానికి తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుంటే వారిని అణిచివేయడానికి స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. దీంతో తెలంగాణ మన్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయందోళనకు గురి అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories