ఖమ్మంలో కూతురితో పాటు నీట్ పరీక్షకు హాజరుకానున్న తండ్రి

Khammam: కూతురు జోషికతో పరీక్ష రాస్తున్న తండ్రి సతీశ్ బాబు

Jyothi
Published on: 7 May 2023 7:58 AM IST
Father-Daughter Duo To Appear For Neet In Khammam
X

ఖమ్మంలో కూతురితో పాటు నీట్ పరీక్షకు హాజరుకానున్న తండ్రి

Khammam: తన కలను సాకారం చేసుకునేందుకు వయసుతో పని లేకుండా తన కుమార్తెతో పాటు నీట్ పరీక్షకు ఓ తండ్రి హాజరుకాబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు ఖమ్మం వేదిక కాబోతోంది. ఖమ్మంలోని ఇంద్రనగర్‌కు చెందిన రాయల సతీష్ బాబు గత 20 సంవత్సరాలుగా ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్ కావాలన్నా తన కల ఎన్నో ఏళ్ళుగా కలగానే మిగిలిపోయింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వయో పరిమితి ఎత్తివేయడంతో తన కల నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశాడు. తన కూతురు జోషికతో నీట్ పరీక్ష రాసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. రెండేళ్ల నుంచి డాక్టర్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నానని, తన తండ్రితో కలిసి పరీక్ష రాయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని జోషిక తెలిపింది.

Jyothi

Jyothi

Next Story