ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. అంబులెన్స్‌కు డబ్బుల్లేక బైక్‌పై బిడ్డ మృతదేహం తరలింపు..

Father Carries Daughters Dead Body on Two-Wheeler
x

ఏ తండ్రికి ఈ కష్టం రావొద్దు.. అంబులెన్స్‌కు డబ్బుల్లేక బైక్‌పై బిడ్డ మృతదేహం తరలింపు..

Highlights

Khammam: ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

Khammam: ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని 65 కిలోమీటర్ల దూరం బైక్ పై తీసుకెళ్లాడు ఓ తండ్రి. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ.. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆస్పత్రిలో ఫ్రీ అంబులెన్స్‌ లేక పోవడం.. ప్రైవేట్‌ అంబులెన్స్‌కి డబ్బులు ఇచ్చే స్థోమత లేక పోవడంతో... కూతురు డెడ్‌బాడీని తండ్రి బైక్‌పై 65 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.

కూతురు మృతదేహాన్ని పొత్తిళ్లలో పెట్టుకొని దు:ఖాన్ని దిగమింగుకుంటూ బైక్ పై ప్రయాణించారు ఆ బిడ్డ తల్లిదండ్రులు. వాగు దాటుకుంటూ చివరకు ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం లేదని చెప్పడంతో.. ప్రైవేట్ అంబులెన్స్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేక, చనిపోయిన కూతురి మృతదేహాన్ని బైక్ పైనే తీసుకొచ్చానని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories