Hyderabad: ఉప్పల్‌లో ఘోరం.. తండ్రీకొడుకుల దారుణహత్య

*నర్సింహశర్మ, శ్రీనివాస్‌ను హత్య చేసిన దుండగులు

Rama Rao
Updated on: 14 Oct 2022 11:56 AM IST
Father and Son Murder in Uppal Hyderabad | Hyderabad News
X

Hyderabad: ఉప్పల్‌లో ఘోరం.. తండ్రీకుమారుడి దారుణహత్య

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌లో దారుణం జరిగింది. తండ్రీకొడుకుల హత్యకు గురయ్యారు. నర్సింహశర్మ, శ్రీనివాస్‌ను దుండగులు హత్య చేశారు. శ్రీనివాస్‌ మలేషియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తుండగా నెల రోజుల క్రితమే స్వస్థలానికి వచ్చాడు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు నరసింహశర్మపై కత్తులతో దాడి చేయగా.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన శ్రీనివాస్‌పైనా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై.. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్తి వివాదాలే ఈ హత్యలకు కారణమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story