Nagarkurnool: నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం

Nagarkurnool: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులు చేస్తుండగా..క్రేన్‌ వైరు తెగిపడి ఐదుగురు కార్మికులు మృతి

Sriveni Erugu
Published on: 29 July 2022 9:01 AM IST
Fatal accident in Nagarkurnool District
X

Nagarkurnool: నాగర్‌కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం

Nagarkurnool: నాగర్‌ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద జరుగుతున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేస్తుండగా క్రేన్ వైరు తెగి పడింది. దీంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పంప్‌హౌస్‌లోకి దిగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. కార్మికుల మృతి ఘటనపై తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story