Farmers Strike: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్‌లో రైతులు ధర్నా

*సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారిపై బైటాయించి రాస్తారోకో *ఐకేపీ సెంటర్లో ధన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన

Shilpa
Published on: 19 Nov 2021 1:30 PM IST
Farmers Strike at Sircilla Kamareddy Highway to Buying Paddy Grain
X

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపూర్‌లో రైతులు ధర్నా

Farmers Strike: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో రైతులు రాస్తారోకో చేపట్టారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైటాయించిన రైతులు, తడిసిన వరి ధాన్యాన్ని ముందు పోసుకొని, దాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ, కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు.

ఐకేపి సెంటర్‌కు గత పది రోజుల క్రితమే దాన్యాన్ని తరలించినప్పట్టికీ కొనుగోలు చేయలేదని, మంత్రి కేటీఆర్ తడిసిన దాన్యాన్ని కొనాలని చెప్పినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల రాస్తారోకోతో ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. రాస్తారోకోకు బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఆందోళనాకారులను నచ్చచెప్పి అక్కడినుండి పంపించారు.

Shilpa

Shilpa

Next Story