జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్

Arun Chilukuri
Updated on: 23 Oct 2020 2:30 PM IST
జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్
X

జగిత్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చలో జగిత్యాల పేరుతో కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు రైతులు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ముట్టడికి బయల్దేరిన మొక్కజొన్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు కలెక్టరేట్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బందం చేస్తున్నారు పోలీసులు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ చలో జగిత్యాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి నుంచే రైతు ఐక్యవేదిక నాయకులతో పాటు, కాంగ్రెస్ ముఖ్య నేతలను నిర్బంధించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని హౌజ్‌ అరెస్ట్ చేయగా ఆయన ఇంటి ముందు భారీగా మోహరించారు పోలీసులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story