Farmers Protest: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Farmers Protest: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.

Arun Chilukuri
Updated on: 1 July 2021 6:56 PM IST
Farmers Protest Against Minister Malla Reddy
X

Farmers Protest: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

Farmers Protest: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి చామకూర మల్లారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి 38 మంది రైతులకు చెందిన 56 ఎకరాల భూమిని కేటాయించారు. మరో 60 ఎకరాల భూమిని డెవలప్ చేసి ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటతప్పిందని రైతులు ఆరోపించారు. తమకు డవలప్ చేసి ఇస్తామన్న భూమి ఏమైందని రైతులు ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story