Jayashankar Bhupalpally: న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతులు

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలిపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 15 Aug 2021 5:34 PM IST
Farmers Falls on Sub Collectors Feet for Land in Jayashankar Bhupalpally
X

Jayashankar Bhupalpally: న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతులు

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలిపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు కొంత మంది రైతులు. గణపురం మండలం కొండాపూర్‌కు చెందిన సామర్ల సదయ్య, నర్సయ్యలకు కొండాపూర్ శివారులో 8/151 సర్వే నెంబర్ లో రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి ఉంది.

అయితే ఈ భూమిని గత 40 ఏళ్ల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటున్నప్పటికి ములుగుకు చెందిన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని పట్టా చేసుకున్నారని, అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిని ఇప్పటివరకు తామే సాగు చేసుకుంటుంన్నామని, మీరైనా న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story