ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రైతుల ధర్నా

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రైతుల ధర్నా
x
Highlights

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తరుగు పేరుతో ధాన్యంలో కోతలు విధిస్తుండటంపై కర్షకులు కన్నెర్ర...

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తరుగు పేరుతో ధాన్యంలో కోతలు విధిస్తుండటంపై కర్షకులు కన్నెర్ర చేశారు. మిల్లర్ల వైఖరిని నిరసిస్తూ వెంకటాపురం మండల కేంద్రంలో పెట్రోల్‌ బంక్ సమీపంలోని వెంకటాపురం-వాజేడు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గంటకు పైగా నిరసన తెలపడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచాయి.

వెంకటాపురం పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లరుకు వెళ్లిన నాలుగు లారీల ధాన్యంలో ఒక్కో క్వింటాకు 10 కిలోల చొప్పున కోతలు విధిస్తామంటూ చెప్పడంపై రైతులు మండిపడ్డారు. గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో కేంద్రాల్లో అమ్మితే కోతల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల దోపిడీని అరికట్టి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. సీఐ శివప్రసాద్‌, డిప్యూటీ తహసీల్దారు రాము, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చించారు. ఉన్నతాధికారులకు సమాచారం తెలపడంతో పాటు రైతు సంఘాల నాయకులతో చర్చిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories