Medak: తహసీల్దార్‌పై డీజిల్‌ పోసిన రైతు

Medak: మెదక్‌ జిల్లా శివ్వంపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉద్రిక్తత నెలకొంది.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 6:25 PM IST
Farmer Pour Diesel on Tahsildar of Shivvampet
X

Medak: తహసీల్దార్‌పై డీజిల్‌ పోసిన రైతు

Medak: మెదక్‌ జిల్లా శివ్వంపేట ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మార్వో ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆగ్రహంతో రైతు ఎమ్మార్వోపై డీజిల్‌ పోశాడు. విద్యుత్ షాక్‌తో తాళ్లపల్లితండా రైతు మృతి చెందాడు. మృతదేహంతో ఎమ్మార్వో ఆఫీస్‌ ముందు ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ భూ సమస్యలు పరిష్కరించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో తహశీల్దార్‌‌ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకపోవడం వల్లనే బాలుకు బీమా డబ్బులు రాలేదని రైతులు ఆరోపించారు.

మంగళవారం రైతులంతా మాలోత్‌ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్‌ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్‌ పోశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చేరుకుని రైతులకు నచ్చజెపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story