తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. ధాన్యం కొనరనే భయంతో..

Warangal: చేతికందిన పంట జేబుకు చేరకపోవడంతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 3:39 PM IST
Farmer Kumar Committed Suicide in Warangal
X

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. ధాన్యం కొనరనే భయంతో.. 

Warangal: చేతికందిన పంట జేబుకు చేరకపోవడంతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం శివాపూర్‌కు చెందిన రైతు కుమార్ పది రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. అయితే, ఆ పంట ఇప్పటికీ అమ్ముడు పోలేదు. దీనికి తోడు మరో ఐదెకరాల వరి కోతకు సిద్ధంగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. చివరికి మరణమే శరణం అనుకున్న కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story