Falaknuma Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌‌లో ఉగ్రవాదులు..? ట్రైన్ నిలిపి తనిఖీలు చేపట్టిన అధికారులు..

Falaknuma Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌‌లో ఉగ్రవాదులు..? ట్రైన్ నిలిపి తనిఖీలు చేపట్టిన అధికారులు..
x
Highlights

Falaknuma Express: ఔరా నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.

Falaknuma Express: ఔరా నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ట్రైన్‌లో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఫోన్ కాల్ రావడంతో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ రైలును ఆపిన రైల్వే పోలీసులు.. స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైలులో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో సుమారు అరగంట పాటు ట్రైన్‌ను నిలిపి తనిఖీలు చేపట్టారు. అయితే ఉగ్రవాదులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు, ప్రయాణికులు. తనిఖీల అరగంట ఆలస్యంగా ట్రైన్ బయలుదేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories