Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నకిలీ హిజ్రాల దందా.. డబ్బులు ఇవ్వకపోకపోతే అసభ్య ప్రవర్తన

Fake Hijras At Traffic Signals In Hyderabad
x

Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నకిలీ హిజ్రాల దందా.. డబ్బులు ఇవ్వకపోకపోతే అసభ్య ప్రవర్తన

Highlights

Hyderabad: కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hyderabad: ఫేక్ ట్రాన్స్ జెండర్స్ హైదరాబాద్‌లో హల్‌చల్ చేస్తున్నారు. కొందరు ఫేక్‌గాళ్లు ట్రాన్స్ జెండర్ల వేషంలో బెగ్గింగ్ చేస్తూ వాహనదారుల జేబులు గళ్ల చేస్తున్నారు. బీహార్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారు. ఫేక్ ట్రాన్స్ జెండర్స్‌పై కొద్ది రోజులుగా ఫోకస్ పెట్టిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కట్టు, బొట్టుతో పాటు వేషధారణ మార్చి ట్రాన్స్ జెండర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో పండగలు, ఉత్సవాల సమయంలో ఉత్తరాది నుంచి దాదాపు వేయి మంది వరకు నకిలీ ట్రాన్స్ జెండర్స్‌గా ఇక్కడి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ ట్రాన్స్ జెండర్స్ ఇంకా ఎక్కడున్నారు.? ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారు..? ఇక్కడ వసూలు చేసిన సొమ్మును ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories