మంత్రి గంగుల కమలాకర్‌కు నకిలీ ఈడీ నోటీస్

* గంగుల సోదరులను అరెస్ట్‌ చేస్తామని నకిలీ ఈడీ నోటీస్ *అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తానని నోటీస్ సారాంశం

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 12:00 PM IST
Fake Enforcement Directorate Notice to Minister Gangula Kamalakar
X

గంగుల కమలాకర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు ఆగంతకులు నకిలీ ఈడీ నోటీస్ పంపారు. గంగుల సోదరులను అరెస్ట్‌ చేస్తామని నకిలీ ఈడీ నోటీస్‌లో పేర్కోన్నారు ఆగంతకులు. అయితే అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తానని ఆ నోటీస్ సారాంశం. నకిలీ ఈడీ నోటీస్‌పై మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను సంప్రదించారు. నకిలీ ఈడీ నోటీస్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆగంతకులపై 420, 468, 471 కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా గంగుల కమలాకర్‌కు సైబర్‌ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story