Fake Doctor Arrests in Hyderabad: టెన్త్‌ చదివిన 'డాక్టర్‌' గుట్టు రట్టు..

Fake Doctor Arrests in Hyderabad: టెన్త్‌ చదివిన డాక్టర్‌ గుట్టు రట్టు..
x
Fake Doctor Arrests in Hyderabad
Highlights

Fake Doctor Arrests in Hyderabad: ఆ వ్యక్తి చదివింది పదో తరగతే కానీ అతను చేసేది మాత్రం డాక్టర్ వృత్తి. ఏంటి ఏంబీబీఎస్ చదివిన వారు కదా డాక్టర్ గా స్థిర పడతారు

Fake Doctor Arrests in Hyderabad: ఆ వ్యక్తి చదివింది పదో తరగతే కానీ అతను చేసేది మాత్రం డాక్టర్ వృత్తి. ఏంటి ఏంబీబీఎస్ చదివిన వారు కదా డాక్టర్ గా స్థిర పడతారు, ఇతను పదో తరగతితోనే డాక్టర్ అయిపోయాడు అని ఆశ్చర్యంగా ఉంది కదా...కానీ ఆశ్చర్యపోకండి. ఇలా తక్కువ చదువులు చదివి ఎంబీబీఎస్ చేసాం అని చెప్పుకుని తిరిగే వైద్యులు కొంత మంది గుట్టు అవుతుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోకూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కేవలం పదో తరగతి చదివిన ఓ వ్యక్తి ఎంబీబీఎస్ చదివినట్టు డుప్లికెట్ సర్టిఫికెట్ ను క్రియేట్ చేసి ఆస్పత్రిని నడిపిస్తున్న నకిలీ డాక్టర్‌ వ్యవహారం బయటపడింది. అంతే కాదు ఆయన విషయంలో ఇంకా ఆశ్చర్యకర విషయాలు ఎన్నో బయటపడ్డాయి.

అసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్‌ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందింది. దీంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సదరు ప్రైవేటు ఆస్పత్రిపై శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. టెన్త్‌ చదివి డాక్టర్‌గా‌ చలామణి అవుతున్న ఫేక్‌ డాక్టర్‌ ముజిబ్‌, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత అసిఫ్‌నగర్‌ పోలీసులకు నిందితులను అప్పగించారు. ఫేక్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories