Fake Certificates: నార్సింగిలో ఫేక్‌ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్‌

Fake Certificates: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటి పట్టుకున్నారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2025 11:04 AM IST
Fake Certificates: నార్సింగిలో ఫేక్‌ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్‌
X

Fake Certificates: నార్సింగిలో ఫేక్‌ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్‌

Fake Certificates: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటి పట్టుకున్నారు. నార్సింగిలో ఓ స్థావరంపై దాడి చేసిన ఎస్ఓటీ..ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా మిర్జా అక్తర్ అలీ బేగ్ అలియాస్ అస్లాం, మమ్మద్ అజాజ్ అమ్మద్, వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్ అనే ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇక, నిందితుల దగ్గర నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ నకిలీ విద్యా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుల వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్లతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్‌ విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story