Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా

Adilabad: స్వామీజీ అంటూ వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 12:08 PM IST
Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా
X

Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా

Adilabad: స్వామీజీ అంటూ ప్రజలు ఆదరిస్తే.. వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది. రాజూర సమీపంలో కొండపై శివాలయంలో ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్‌ అనే సాధువు నివాసం ఉంటున్నాడు. రెండేళ్లుగా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలోని మరో ఆలయం పక్కన ఉంటున్నాడు.

ఈ నెల 16న రాత్రి 8 గంటలకు సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక నీళ్లతో పాటు ప్రసాదాన్ని తీసుకెళ్లింది. సదరు బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మందిరం పక్కనే ఉండే నివాసానికి తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బాలిక స్పృహ కోల్పోయి ఉంది. బాలిక ద్వారా అత్యాచారయత్నం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story