Abdullapurmet: వివాహేతర సంబంధమే వీళ్ల ప్రాణం తీసింది.. ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్..

Abdullapurmet: హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Arun Chilukuri
Published on: 4 May 2022 1:08 PM IST
Extramarital Affair Led to Murders in Abdullapurmet
X

Abdullapurmet: వివాహేతర సంబంధమే వీళ్ల ప్రాణం తీసింది

Abdullapurmet: హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మేడే రోజు జరిగినట్టుగా గుర్తించిన ఈ ఘటనలో మృతులు వారాసిగూడకు చెందిన యశ్వంత్, జ్యోతిగా తేల్చారు. ఆదివారం ఇంటినుంచి వెళ్లిన యశ్వంత్ అబ్దుల్లాపూర్ మెట్ కొత్తగూడెం బ్రిడ్జ్ దగ్గర జ్యోతితో ఏకాంతంగా గడపాలని వెళ్లాడు. వారిద్దరూ వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్, చాప, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ పూలు, సెల్ ఫోన్ ఛార్జర్, వెంట తీసుకెళ్లారు.

అక్కడ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆ ఇద్దరిపై దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యలకు కారణం జ్యోతి భర్తగానే అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి హత్యలకు కారణం జ్యోతి భర్తగానే నిర్ధారించారు. జ్యోతి భర్త ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story