Coronavirus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

X
ఫైల్ ఇమేజ్
Highlights
Coronavirus: కొత్తగా 1,914 కరోనా కేసులు * గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి
Sandeep Eggoju7 April 2021 5:05 AM GMT
Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు 2వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 74వేల274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,914 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3లక్షల, 3వేల, 299కి చేరింది. ప్రస్తుతం 11వేల617 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 6వేల 634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి.
Web TitleCoronavirus: Expanding Coronavirus in Telangana-07-04-2021
Next Story