logo
తెలంగాణ

Medchal: మేడ్చల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Excise Police Seized Rs 2 Crore Worth Drugs in Medchal
X

Medchal: మేడ్చల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Highlights

Medchal: మేడ్చల్‌ జిల్లాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Medchal: మేడ్చల్‌ జిల్లాలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 2కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పవన్‌, మహేశ్‌, రామకృష్ణను అరెస్ట్‌ చేశారు. కూకట్‌ పల్లిలో 4 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు పవన్‌ ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్‌లో 4 కిలోల మెఫిడ్రిన్‌ను సీజ్‌ చేశారు.

ప్ర‌ధాన నిందితులైన ఎస్‌కే రెడ్డి, హ‌నుమంత రెడ్డి ప‌రారీలో ఉన్నారు. అయితే విద్యార్థుల‌ను టార్గెట్ చేసుకుని ఈ డ్ర‌గ్‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. డ్ర‌గ్స్ ర‌వాణాకు ఉప‌యోగించిన కారును కూడా సీజ్ చేసిన‌ట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ఏ చంద్రయ్య గౌడ్ తెలిపారు.

Web TitleExcise Police Seized Rs 2 Crore Worth Drugs in Medchal
Next Story