CH Vittal - BJP: బీజేపీలో చేరిన సీహెచ్ విఠల్..

CH Vital: బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి.

Arun Chilukuri
Updated on: 6 Dec 2021 5:22 PM IST
Ex TSPSC Member CH Vital Joins BJP
X

బీజేపీలో చేరిన సీహెచ్ విఠల్..

CH Vital: బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యోగుల సంఘం నేత, T.S.P.S.C మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. విఠల్‌కు కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. విఠల్‌తో పాటు చందు శ్రీనివాస్ రావు, టి.శ్రీనివాస్ రావు, వివేక్‌ బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story