కవితను కేబినెట్‌లో తీసుకుంటే ఎర్త్ ఎవరికి?

కవితను కేబినెట్‌లో తీసుకుంటే ఎర్త్ ఎవరికి?
x
kalvakuntla kavitha (File Photo)
Highlights

మంత్రిగా బాధ‌్యతలు చేపట్టేందుకే, కల్వకుంట్ల కవిత పెద్దల సభలో అడుగుపెడుతున్నారా? కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరించబోతున్నారా? లేదంటే పార్టీలోనే...

మంత్రిగా బాధ‌్యతలు చేపట్టేందుకే, కల్వకుంట్ల కవిత పెద్దల సభలో అడుగుపెడుతున్నారా? కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరించబోతున్నారా? లేదంటే పార్టీలోనే కీరోల్‌ పోషించేందుకు సిద్దమవుతున్నారా? జాతీయ రాజకీయాలు వద్దని, స్టేట్‌ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కవిత లక్ష్యమేంటి? ఇక నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు?

నిజామాబాద్ స్ధానిక సంస్ధల శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కవిత నామినేషన్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె రీ ఎంట్రీ పై అధికార పార్టీలో చర్చోపచర్చలు జరిగాయి. రాజ్యసభకు కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. ఐతే చివరి నిమిషంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటు సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమె అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. స్థానిక సంస్ధల ఎమ్మెల్సీగా కవిత వస్తారని ప్రచారం జరిగినప్పటికీ, కవిత ఆసక్తితో లేరని ప్రచారం జరిగింది. ఐతే అనూహ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ కవిత పేరును తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారు చేయడంతో ఆమె అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు టీఆర్ఎస్‌కే అధికంగా వుండటంతో, ఆమె ఎన్నిక లాంచనం కానుంది. ఇక నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆలక్తిగా మారింది.

మాజీ ఎంపీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎంపీగా ఐదేళ్ల పాటు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత ఓడిన చోటు నుంచే తన రాజకీయ భవిష్యత్తును స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ రూపంలో పునాది వేసుకోబోతున్నారు. ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోను ఆమె చక్రం తిప్పబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికయ్యాక రాష్ట్ర క్యాబినెట్ లో కీలక శాఖ కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఎలాంటి శాఖను కేసీఆర్‌ అప్పగించబోతున్నారన్నది అంతే ఉత్కంఠ కలిగిస్తోంది.

అయితే, కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదంటే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ప్రభుత్వంలో ఇప్పటికే కేటీఆర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు చేపట్టడంతో, పూర్తిస్థాయిలో రెండింటిపైనా దృష్టిపెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. త్వరలో కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలకు సమయం కేటాయించాలని ఆలోచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవితకు మంత్రివర్గంలో చోటివ్వడంతో పాటు, పార్టీ బాధ్యతలనూ అప్పగించే అవకాశముందన్న చర్చా జరుగుతోంది. ఎమ్మెల్సీ లేదా మంత్రి హోదాలో ఇక ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కవిత కీలకంగా వ్యవహరించబోతున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అయితే, కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ఎవరిని తప్పిస్తారన్నది, మిగిలిన మంత్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories