బిజెపి లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత..

Bikshamaiah Goud: బిజెపిలో చేరిన భిక్షమయ్య గౌడ్

Jyothi
Published on: 5 April 2022 11:55 AM IST
Ex MLA Bikshamaiah Goud Joins BJP Party
X

బిజెపి లో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత..

Bikshamaiah Goud: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు బిజెపి నేతలు. ప్రత్యర్థి పార్టీల్లో అసమ్మతులను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్యా గౌడ్ ను పార్టీలో చేర్చుకోవడంలో విజయవంతమయ్యారు. బిజెపి రాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ నేతృత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ కమలం గూటికి చేరారు. పార్టీ నేతలు భిక్షమయ్య గౌడ్ ను కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తరుణ్ చుగ్ చేతుల మీదుగా భిక్షమయ్య పార్టీ సభ్యత్వం స్వీకరించారు.

Jyothi

Jyothi

Next Story