Ponguleti Srinivasa: మాజీ మంత్రి తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా

Ponguleti Srinivasa: సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం కోసమే తాను రాజకీయాల్లో ఉంటున్నా

Shekhar G
Published on: 2 Sept 2023 12:43 PM IST
Ex Minister Thumma Is Invited To The Congress Party Says Ponguleti Srinivasa
X

Ponguleti Srinivasa: మాజీ మంత్రి తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా

Ponguleti Srinivasa: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. మాజీ మంత్రి తుమ్మలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీ బలోపేతానికి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేశారన్నారు. ఏ పార్టీలో ఉన్న నిజాయితీతో పని చేస్తే తుమ్ములను కొన్ని శక్తులు పోమనలేక పొగపెట్టి బయటకు పంపిస్తున్నారని పొంగులేటి విమర్శించారు. తమ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామంటే సీఎం అపాయింమెంట్‌ కూడా దొరకని పరిస్థితి ఉందని పొంగులేటి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఆహ్వానించేందుకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్‌కు తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని ఆయన వెల్లడించారు. తనకు వచ్చిన అవకాశంతో జిల్లాను అభివృద్ధి కోసం పని చేశాన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం కోసమే తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story