Ex Minister Damodar Reddy Car Accident: మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం..

Damodar Reddy Car Accident: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది

Sumitra
Updated on: 1 July 2020 3:45 PM IST
Ex Minister Damodar Reddy Car Accident: మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం..
X

Ex Minister Damodar Reddy Car Accident: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి రాంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తాడింది. దీంతో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తివివరాల్లోకెళితే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మంగళవారం రాత్రి కారులో ప్రయాణిస్తున్న సమయంలో సుజాత నగర్‌ మండలం డేగల మడుగు వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో ఆయన కారు అదుపు తప్పి రోడ్డుపైనే బోల్తా కొట్టింది. అది గమనించిన స్థానికులు ఆయన్ని వెంటనే బయటికి తీసారు. అనంతరం ఆయన్ను స్థానిక వైద్యులతో ప్రథమ చికిత్స అందించి అనంతరం మరో వాహనంలో లింగాలకు పంపించారు. ఈ ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు, కుటుంబ సభ్యులు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.


Sumitra

Sumitra

Next Story