Harish Rao: ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ మాట తప్పింది

Harish Rao: ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి

Shekhar G
Updated on: 27 Feb 2024 6:43 PM IST
Ex Minister Harish Rao Comments On Revanth Reddy Decision About LRS
X

Harish Rao: ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ మాట తప్పింది

Harish Rao: హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ట్వీటర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేయడంతో పాటు.ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు మాట తప్పిందంటూ ఆరోపించారు. ఇదే అంశంపై గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇపుడు ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజులు వసూలు చేస్తామనడం దారుణమన్నారు. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story