తుపాకీతో మాజీ మంత్రి హల్‌చల్‌

తుపాకీతో మాజీ మంత్రి హల్‌చల్‌
x
Highlights

Gutta Mohan Reddy: నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో హల్‌చల్‌ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో...

Gutta Mohan Reddy: నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీతో హల్‌చల్‌ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పెద్దకాపర్తి చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు తమ పొలం మీదుగా జరుగుతున్నాయని తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడికి వచ్చి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన కాల్వ పనులు చేస్తున్న వారిని తన తుపాకీతో బెదిరించారు. పనులు నిలిపేయాలంటూ వాగ్వాదానికి దిగారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఈ వ్యవహారం ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. త్వరలో గుత్తా మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.



Show Full Article
Print Article
Next Story
More Stories