BRS పార్టీలో జోరందుకున్న చేరికలు

BRS పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, వందకు పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లోకి చేరారు.

Arun Chilukuri
Updated on: 9 Oct 2025 2:33 PM IST
BRS పార్టీలో జోరందుకున్న చేరికలు
X

BRS పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్, వందకు పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లోకి చేరారు. దీంతో హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ రైతు, విద్యార్థి, ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాటించడం సహించక.. బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలని అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగుతుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story