బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి రిమాండ్‌

రహే‌ల్‌ను జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు

Jyothi
Published on: 8 April 2024 12:05 PM IST
Ex-Bodhan MLA Shakeel son Remand
X

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి రిమాండ్‌ 

TS: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడికి కోర్టు రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రహేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో రహేల్‌కు ఈనెల 22వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాభవన్‌ దగ్గర రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలో ఉంచి దుబాయ్ పారిపోయాడు షకీల్‌.

దాంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ముందు హాజరుపర్చగా రహేల్‌కు ఈ నెల22వరకు రిమాండ్‌ విధించారు.

Jyothi

Jyothi

Next Story