Telangana: నా శాఖను బదిలీ చేశారు సంతోషం- మంత్రి ఈటల

Telangana: వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్‌కు బదిలీ చేయడంపై ఈటల రాజేందర్‌ స్పందించారు.

Arun Chilukuri
Published on: 1 May 2021 3:25 PM IST
Etela Rajender welcomes transfer of his portfolio
X

Telangana: నా శాఖను బదిలీ చేశారు.. సంతోషం- మంత్రి ఈటల


Telangana: వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్‌కు బదిలీ చేయడంపై ఈటల రాజేందర్‌ స్పందించారు. తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానన్నారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి. ప్లాన్‌ ప్రకారమే నాపై భూకబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి అని ఈటల మీడియాతో అన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుంటానని ఈటల స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story