Etela Rajender: ఇవాళ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. ప్రత్యేక విమానంలో..

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

Arun Chilukuri
Updated on: 12 Jun 2021 11:15 AM IST
Etela Rajender To Resign To MLA Post Today
X

ఈటల రాజేందర్(ఫైల్ ఇమేజ్ )

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈనెల 14న బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఆయన ఇవాళ అధికారికంగా రాజీనామా సమర్పించనున్నారు. గన్‌పార్క్‌ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత ఈటల అసెంబ్లీకి వెళ్లనున్నారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేసే అవకాశముంది. అటు టీఆర్‌ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామాను పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నెల 14న బీజేపీలో ఈటల చేరికకు రంగం సిద్ధమైంది. అదేరోజు ఉదయం బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న ఈటల బీజేపీ పెద్దలు నడ్డా, అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమతో పాటు కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన రమేశ్ రాథోడ్ బీజేపీలో చేరనున్నారు. ఇక ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి కూడా ఈటలతో పాటు బీజేపీలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ విష‍యంపై నిన్న ఈటల నివాసంలో బీజేపీ నేతలతో చర్చించారు అ‌శ్వత్థామ రెడ్డి. ఇలా తన వెంట వచ్చే నేతలు, భాజపా రాష్ట్ర ముఖ్యనేతలను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈటల ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story