Etela Rajender: పోలీసులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఈటల రాజేందర్‌

Etela Rajender: కరీంనగర్‌ జిల్లా నేరెళ్లలో రెండోరోజు పాదయాత్రలో ఈటల రాజేందర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 20 July 2021 5:18 PM IST
Etela Rajender Strong Counter to Police
X

Etela Rajender: పోలీసులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఈటల రాజేందర్‌

Etela Rajender: కరీంనగర్‌ జిల్లా నేరెళ్లలో రెండోరోజు పాదయాత్రలో ఈటల రాజేందర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడు దారి పొడవునా ఉన్న జెండాలను, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తామేమైనా నక్షలైట్లమా అంటూ నిలదీశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని, ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండని అన్నారు. డ్యూటీ చేయడం ఇష్టంలేకపోతే పోయి గులాబీ కండువా కప్పుకొని, కేసీఆర్‌కు బానిసలమని ప్రకటించుకోండంటూ పోలీసులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఈటల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story