Etela Rajender: నోటీసులిచ్చి భయపెట్టాలని చూస్తున్నారు

Etela Rajender: నోటీసులపై స్పందించిన ఈటల రాజేందర్‌

Jyothi
Published on: 7 April 2023 6:37 PM IST
Etela Rajender Responded to the Notices
X

Etela Rajender: నోటీసులిచ్చి భయపెట్టాలని చూస్తున్నారు

Etela Rajender: టెన్త్‌ హిందీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందించారు. హిందీ పరీక్ష రోజు ఎవరో వ్యక్తి తనకు వాట్సాప్‌ చేస్తే కనీసం దాన్ని చూడకపోయినా కూడా నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు ఈటల. చట్టం, పోలీసుల మీద నమ్మకం ఉందని.. విచారణకు హాజరవుతానని తెలిపారు. బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి.. తనకు నోటీసులు ఇచ్చి కార్యకర్తల్లో భయం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని.. తనకేమి కేసులు కొత్త కాదన్నారు. కేసీఆర్‌కు పోయే కాలం వచ్చిందన్న ఆయన ఓడిపోయే ముందు ఆరాటపడుతున్నారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story