బండి సంజయ్ దీక్షకు హాజరైన ఈటల

* బండి దీక్షకు ఈటల హాజరవ్వడంపై రాజకీయవర్గాల్లో చర్చ

Dhatripriya
Updated on: 6 March 2023 5:14 PM IST
Etela Rajender Participated In Bandi Sanjay Deeksha
X

బండి సంజయ్ దీక్షకు హాజరైన ఈటల

Bandi Sanjay: ఒకరు మొదటి నుంచి ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న లీడర్‌.. ఇంకొకరు మధ్యలో వచ్చినా యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్న లీడర్‌.. ఈ ఇద్దరికీ అసలు పొసుగుతుందా..? అనేది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న చర్చే. అసలు ఈ ఇద్దరు నేతలకు ఉప్పు నిప్పులా పడనే పడదంటూ వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఆ ఇద్దరు లీడర్లే పక్కపక్కన కూర్చోవడం ఇప్పుడు మరో హాట్‌టాపిక్ అయింది. బండి సంజయ్ చేపట్టిన దీక్షలో ఈటల, బండి సంజయ్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఉన్న గ్యాప్‌ ఇప్పుడు కవర్ అయిపోయిందా..? లేక కేవలం పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికే వచ్చారా..? అనేది పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయంగా మారింది.

ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదికపై కన్పించారు. బండి సంజయ్ దీక్షకు హాజరైన ఈటల రాజేందర్ హాజరయ్యారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిదంటూ ప్రచారం జరుగుతోంది. బండి దీక్షకు ఈటల హాజరవ్వడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలయ్యింది.



Dhatripriya

Dhatripriya

Next Story